అంతర్వేది ఘటనలో ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు ఫైర్ .

అంతర్వేది ఘటనలో ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు ఫైర్ .

0
103

అంతర్వేది లో రథం దగ్దమైన ఘటన ఇప్పటికే హిందువులు అనుభవించే బాధ వర్ణాతీతంగా ఉంటె , హిందువులని రెచ్చగొడుతున్నారని కొందరు వైసీపీ నేతలు చేసే వాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు .

ఇలాంటి ఘటనపై రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంటే కనీసం ప్రభుత్వం స్పందించక పోవడం పై అయన ఆగ్రహం వ్యక్తం చేసారు . చలో అంతర్వేది కార్యక్రమంలో భాగంగా ఇంతమంది యువకులు ,మహిళలు పోరాటం చేస్తుంటే ,దానికి సపోర్ట్ చెయ్యాల్సిన ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయడమేంటనీ అయన చేస్తున్న వాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి .

అరెస్ట్ చేసిన వాళ్ళందర్నీ విడుదల చేసే దాక మా పోరాటం సాగుతుందని సోము వీర్రాజు అన్నారు . అయితే ఈ విషయం లో మిగతా అన్ని పార్టీ లనుండి ప్రభుత్వానికి విమర్శలు వస్తూనే ఉన్నాయి . దీనికి సర్కార్ సమాధానమేంటో చూడాలి మరి .