ఆ విషయంలో సోము వీర్రాజు సక్సెస్ అవుతారా…

ఆ విషయంలో సోము వీర్రాజు సక్సెస్ అవుతారా...

0
94

ఏపీలో బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంలో కొన్ని వర్గాలకు మింగుడు పడటంలేదా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో… ముఖ్యంగా తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వలస వెళ్లిన నేతలకు మింగుడుపడకుందని వార్తలు వస్తున్నాయి… బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బాహాటంగా విమర్శలు చేయకపోయినా నూతన అధ్యక్షుడు వీర్రాజుకు శుభాకాంక్షలు చెప్పకుండా దాటవేయడం అందుకు నిదర్శనంగా చెప్పవచ్చని విశ్లేషకులు అంటున్నారు…

రాష్ట్రఅధ్యక్షుడు మార్పుతో రాష్ట్రంలో పెద్దగా పార్టీ పరమైన మార్పులు ఉండవని సీనియర్లు పేర్కొంటున్నారు… కేవలం వ్యూహాత్మకంగానే అధిష్టానం వీర్రాజును రంగంలోకి దించిందనేది మరికొందరి వాదన… సాధారణంగా ఏ పార్టీకైనా ప్రధాన వైఖరి ఒకటే ఉంటుందిన కానీ ఏపీ బీజేపీలో పరిస్థితి వేరు..

ఇక్కడ ఆ పార్టీకి రెండు ప్రతిపక్షాలు… ఒకవైపు జగన్ పై విమర్శలు చేస్తే మరోవైపు చంద్రబాబును చెడుగుడు ఆడుకోవాలి…ఈ రెండు అంశాలు భిన్న ధృవాల్లాంటివి మరి కొత్తగా నియమింపబడ్డ రాజుగారు ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి… ఈ విషయంలో కన్నాఫెల్యూర్ అయ్యారని గతంలో వార్తలు వచ్చాయి… మరి ఇప్పుడు రాజుగారు తన వ్యూహాన్ని ఎలా ప్రదర్శిస్తారో చూడాలి…