ఏపీలో బియ్యం బదులుగా నగదు పథకంపై సోము వీర్రాజు షాకింగ్ కామెంట్స్..

0
56

దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డు ఆధారంగా ఇంటి సభ్యులను బట్టి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  బియ్యం పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సరుకుల కింద  ప్రజలకు బియ్యం, పంచదార, కందిపప్పులాంటి పదార్దాలు కూడా పంపిణి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదనే ఉదేశ్యంతో.. రాష్ట్రంలో ప్రత్యేక వాహనాల ద్వారా వాలంటీర్లు ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్నారు.

రేషన్ కార్డుదారులకు బియ్యం వద్దంటే నగదు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయముపై సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. బియ్యం బదులు నగదు ఇవ్వడంపై ఏదో కుట్ర ఉందని పేర్కొన్నారు. బియ్యాన్ని విదేశాలకు పంపించే కుట్రలో భాగమే బియ్యానికి బదులు నగదు పథకమని మండిపడ్డారు. దీని వెనక ప్రభుత్వ పెద్దల కూడా ఉన్నారని తెలిపారు.

గాజువాక అనకాపల్లి నర్సాపురం కాకినాడ నంద్యాల పట్టణాల్లో సర్వే నిర్వహించిన క్రమంలో ఎక్కువ జనం బియ్యమే కావాలని ఆరోపించారు. అందుకే ప్రజలకు బియ్యమే ఇవ్వాలని హెచ్చరించాడు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కూడా రేషన్ బియ్యం కావాలనే ఎక్కువ జనం మొగ్గుచూపారు. ప్రజల రేషన్ పథకాన్ని ముంచుదామనే ఈ నగదు పథకాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.