సోనియాగాంధీ కుటుంబం గురించి మీకు తెలియని విషయాలు

సోనియాగాంధీ కుటుంబం గురించి మీకు తెలియని విషయాలు

0
96

సోనియా గాంధీ మన దేశంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు, కాంగ్రెస్ పార్టీని దశాబ్దాలుగా ముందు ఉండి ఆమె నడిపిస్తున్నారు…సోనియాగాంధీ అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో.. ఇటలీకి చెందిన ఈమె 1946 డిసెంబరు 9న జన్మించారు.. 1998 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

సోనియా తల్లిదండ్రులు స్టిఫెనో, పోలా మైనో…వారు ఇటలీలోని లూసియానా దగ్గర ఉన్న కంట్రడా మెయిని గ్రామంలో జన్మించారు …ఈ గ్రామం విచెంజాకు 30 కి.మీ. దూరంలో ఉంది.. సోనియా టురిన్ కు దగ్గర్లోని ఒర్బస్సానో అనే పట్టణంలో పెరిగారు… ఈమె తండ్రి స్టీఫెనోకు ఆ పట్టణంలోనే ఒక నిర్మాణ వ్యాపార సంస్థ ఉంది. ముందు నుంచి ఆమె కుటుంబం ఉన్నతంగా ధనవంతులుగా ఉన్నవారే.

ఆయన రెండో ప్రపంచ యుద్ధం లో సోవియట్ మిలటరీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన 1983లో మరణించారు….1964లో బెల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భాషా స్కూల్ లో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఆమె కేంబ్రిడ్జ్ నగరం వచ్చారు…..ఆ నగరంలోని ఓ గ్రీక్ రెస్టారెంట్ లో 1965లో ఆమె రాజీవ్ గాంధీ ని కలిశారు.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో రాజీవ్ ఇంజినీరింగ్ చదివేవారు. వీరిద్దరూ 1968లో హిందూ వివాహ సంప్రదాయంలో పెళ్ళి చేసుకున్నారు…పెళ్ళయ్యక సోనియా ఇండియా వచ్చేశారు. తర్వాత పలు రాజకీయ పరిణామాలతో మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ మరణం తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూసుకున్నారు.