త్వరలో పీఎం కిసాన్ నిధుల విడుదల..డబ్బులు పొందాలంటే ఈకేవైసి తప్పనిసరి..

0
108
Pm Kisan samman

ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చారు. వీటిలో ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న పథకం మీద ఆధారపడి నివసించే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏటా 6000 నగదు అందుతుంది.

అయితే ఇప్పటివరకు పదకొండు విడతలుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసింది. 3 విడతలుగా రూ. 2000 అందిస్తుంది. కాగా త్వరలో 12వ విడత డబ్బులు విడుదల కానున్నాయి. ప్ర‌ధానమంత్రి కిసాన్ స‌మ్మాన్‌ నిధి (పీఎం – కిసాన్‌) కింద ప్ర‌యోజ‌నాలు పొందేందుకు రైతులు ఇకేవైసీని త‌ప్ప‌నిసరిగా పూర్తి చేయాలి.

ఇందుకు చివ‌రి తేది ఆగస్టు 31, 2022. పీఎమ్ కిసాన్‌కి రిజిస్ట‌ర్ చేసుకున్న‌ రైతులు ఆన్‌లైన్‌లో పీఎమ్ కిసాన్ వెబ్‌సైట్ ద్వారా గానీ, ఆఫ్‌లైన్‌లో కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్‌ను (సీఎస్‌సీ)కి వెళ్లిగాని ఇకేవైసీ పూర్తి చేయ‌వ‌చ్చు. ఆధార్ కార్డుతో సీఎస్‌సీ సెంట‌ర్‌కి వెళ్లి బ‌యోమెట్రిక్ ద్వారా ఇకేవైసి పూర్తి చేయ‌వ‌చ్చు.