సౌదీ రాజు సల్మాన్ సంచలన నిర్ణయం

సౌదీ రాజు సల్మాన్ సంచలన నిర్ణయం

0
106

ఈ వైరస్ దారుణంగా విజృంభిస్తోంది, ఈ సమయంలో ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాల్సిందే, అయితే ఈ సమయంలో విదేశాలకు వెళ్లాలి అనుకున్నా టూర్ కు వెళ్లాలనుకున్నా కొద్ది రోజులు ఆగాల్సిందే, ఆయా దేశాలు కూడా అనుమతి నిరాకరిస్తున్నాయి.

తాజాగా సౌదీ రాజు సల్మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదికి హజ్ యాత్రకు విదేశీయులను ఎవరినీ అనుమతించబోవడం లేదని ప్రకటించారు. ఇక ఇప్పటికే ఎవరైతే చేరుకున్నారో వారిని అనుమతిస్తామని తెలిపారు.

హజ్ యాత్రికుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సౌదీ అధికారులు తేల్చిచెబుతున్నారు. ఈ వైరస్ ఇక్కడ ఎక్కువగా విజృంభిస్తోంది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
మనుషుల ప్రాణాలను కాపాడాలని ఇస్లాం చెబుతోంది.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం..అని సౌదీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక సౌదీలో ప్రతీయేటా 25 లక్షల మంది హజ్ యాత్రికులు అక్కడకు వస్తారు
భారత్ నుంచి 2 లక్షల మందికి పైగా ముస్లింలు మక్కాను సందర్శిస్తుంటారు. ఇక ఈసారి నో ఎంట్రీ అంటోంది అక్కడ ప్రభుత్వం.