Breaking: పెద్దల సభకు దక్షిణాది ప్రముఖులు

0
82

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్​ చేసింది. అయితే వీరందరిని దక్షిణాది నుంచే ఎంపిక చేయడం విశేషం. ఈ జాబితాలో దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డే ఉన్నారు. వీళ్ల నామినేట్‌ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్‌లో స్వయంగా ప్రకటించారు.