Flash: ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

0
95

ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన రాజకీయం ముగియలేదు. ఎన్నికల అనంతరం విలువడిన ఎగ్జిట్‌పోల్స్‌లో యూపీలో విజయం సాధించేది బీజేపీయేనని స్పష్టమైంది. ఈ నెల 10వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ, అటు ఎస్పీ పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్‌ను మేం నమ్మడం లేదన్న ఎస్పీ చీఫ్‌.. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని ఆరోపించారు. అంతేకాదు బీజేపీ ఓడిపోయే చోట్ల ఎన్నికల సంఘమే ఈవీఎంలను మార్చిందని సంచలన ఆరోపణలు చేశారు..