కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టిపెట్టాలి..సీఎం కేసీఆర్

0
114

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కార్మికుల సమస్యలు- కనీసవేతనాలు- తదితర సమస్యల పరిష్కారం కోరుకుంటూ..రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి లేఖ రాసారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పొషిస్తున్న కార్మికుల కనీస వేతనాలు గత 8 సం||రాలుగా పెంచకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా రాష్ట్రంలోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని, కోటి మంది కార్మికుల ప్రయోజనాలను కోసం కనీస వేతనాలు సవరించాలని ముఖ్యమంత్రి ఈ మేరకు కోరుకున్నారు.

రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం పరిధిలో 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ ఉన్నాయి. వీటిల్లో సుమారు కోటి మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. ప్రతి 5 సం||రాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల సలహా మండలి సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు సవరించాల్సి వుంటుంది. కానీ రాష్ట్రం ఏర్పడి 8 సం||లు గడిచినా కార్మికుల కనీస వేతనాలు సవరించలేదు. 2021 జూన్‌ నెలలో 5 జీవోలను విడుదల చేసింది. వాటిని గెజిట్‌ కూడా చేయలేదు. వాటికి గెజిట్‌ చేయాలని, మిగిలిన 68 షెడ్యూల్డ్‌ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను సవరించాలని, బీడీ, హమాలీ, భవన నిర్మాణం, ట్రాన్స్‌పోర్టు రంగాల కార్మికులతో పాటు ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

కాంట్రాక్టు, క్యాజువల్‌, తాత్కాలిక పద్ధతుల్లో కార్మికులతో యాజమాన్యాలు రోజుకు 12 గంటలు పని చేయిస్తున్నారు. కనీస వేతనం నెలకు రూ.10-12 వేలు దాటడం లేదు. అనేక కంపెనీలలో పి.ఎఫ్‌., ఇ.ఎస్‌.ఐ. బోనస్‌, సెలవులు లాంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయడం లేదు. స్పెషల్‌ ఎకానమిక్‌ జోన్స్‌ (సెజ్‌ల) పేరిట ఏర్పాటు చేసిన పరిశ్రమలలో కార్మిక చట్టాలు అమలు చేయకుండా, యూనియన్లు పెట్టుకోకుండా అడ్డుకుంటున్నారు. ప్రశ్నించిన వారిని నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.
పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇఎస్‌ఐ ఆసుపత్రులు లేవు. వున్నా సిబ్బందికొరత, మందుల కొరతతో సరైన వైద్యం అందడం లేదు. బీహార్‌, యు.పి., ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులు పెద్దసంఖ్యలో మన రాష్ట్రంలో పని చేస్తున్నారు. వీరి పరిస్థితి అధ్వాన్నంగా వుంది.

కనీస వేతనాల చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి వరకు కనీస వేతనాలు మూడుసార్లు సవరణ జరగవల్సి వుంది. కార్మిక సంఘాల ఒత్తిడి, హైకోర్టు ఆదేశం మేరకు కనీస వేతనాల సలహా మండలిని 2014లో ఏర్పాటు చేశారు. కాలపరిమితి ముగిసిన జి.ఓలను సవరించాలని కనీస వేతనాల సలహా మండలి ప్రతిపాదన పంపింది. 2015 నుండి నేటి వరకు ప్రభుత్వం ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నది. ట్రాన్స్‌పోర్టు రంగంలో సుమారు 16 లక్షలు మంది ఉన్నారు. వీరి జి.ఓ.నెం. 25 ను గెజిట్‌ చేయాలి. వెల్ఫెర్‌ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ రంగంలో సుమారు 20లక్షల మంది ఉంటారు.

వెల్ఫేర్‌ బోర్డులో 14 లక్షల మంది నమోదు చేసుకున్నప్పటికీ 8లక్షల మంది మాత్రమే రెన్యువల్‌ చేసుకున్నారు. కార్మికులందరిని బోర్డులో నమోదు చేయాలి. అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికులకు లక్ష బైక్‌లు ఇస్తామని హామీయిచ్చి నేటికి అమలు చేయలేదు. లోడింగ్‌ – అన్‌లోడింగ్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలో పనిచేసే హమాలీ కార్మికుల 5లక్షల మందికి ఎలాంటి చట్టపరమైన భద్రత సౌకర్యాలు లేనందున వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి. ఉత్తర తెలంగాణలో బీడీ పరిశ్రమ కీలకమైంది. బీడీ రంగంలో సుమారు 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. 2012లో జి.ఓ.నెం. 41 ప్రకారం వేతనాలు పెంచి మళ్ళీ దాన్ని అబెయన్స్‌లో పెట్టారు.  రాష్ట్రం ఏర్పడి 7 సం||లు గడిచినా ఆ జి.ఓ.ను పునరుద్ధరించలేదు. లేదా కనీస వేతనాలు పెంపుదల చేస్తూ మరొక జీ.వో కూడా విడుదల చేయపోవడం శోచనీయం అని పేర్కొన్నారు.