Alert: నేటి నుంచి హైదరాబాద్ లో స్పెషల్ డ్రైవ్..ఆ వాహనాలు సీజ్!

Special drive in Hyderabad from today..those vehicles are under siege!

0
113

హైదరాబాద్‌లో రోజురోజుకూ ట్రాఫిక్‌ రద్దీ పెరిగిపోతోంది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో పెరిగిపోతున్న ఆటోలు కూడా ఇందుకు ఓ కారణమని ట్రాఫిక్‌ పోలీసులు తమ అధ్యయనంలో గుర్తించారు.

ఈ నేపథ్యంలో నేటి నుంచి హైదరాబాద్ లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు పోలీసులు. నిబంధ‌న‌లకు విరుద్దంగా, రిజిస్ట్రేషన్ లేకుండా..ఇష్టాను సారంగా తిరుగుతున్న ఆటోల‌పై కొర‌డా ఝుళిపించ‌డానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు. కాగ హైదరాబాద్ ర‌వాణా శాఖ గ‌ణాంకాల ప్ర‌కారం.. 1.5 ల‌క్షల ఆటోల రిజిస్ట్రేషన్ మాత్ర‌మే ఉన్నాయి. కానీ న‌గ‌రంలో దాదాపు 3 ల‌క్షల‌కు పైగా ఆటోలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పెషల్ డ్రైవ్ కోసం రంగం సిద్ధం అవుతుంది. నేటి నుంచి జరిగే స్పెషల్ డ్రైవ్ లో ఆటోల ధ్రువప‌త్రాలు లేకుండా ఉంటే..వేంట‌ను సీజ్ చేయ‌నున్నారు.

అలాగే హైద‌రాబాద్ న‌గర ప‌రిధిలో ఆటోలు తిర‌గాలంటే త‌ప్ప‌కుండా హైద‌రాబాద్ లోనే రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇత‌ర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోల‌కు న‌గ‌రంలోకి అనుమ‌తి ఉండ‌దు. అంటే టీఎస్ లేదా ఏపీ 09 – 13 నంబ‌ర్ తో రిజిస్ట్రేషన్ ఉన్న ఆటోలు మాత్రేమ‌.. న‌గ‌రంలో అనుమ‌తి ఉంటుంది. ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్, ఇన్సూరెన్స్, యూనిఫాం తప్పనిసరిగా ఉండాలని పోలీసులు ఆటోడ్రైవర్లకు సూచిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆటోలకు జరిమానాలు.. అనుమతిలేకుండా నగరంలోకి ప్రవేశించిన ఆటోలను సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు.