మీరాబాయి చానుకు విశిష్ట గౌరవం – మణిపూర్ ప్రభుత్వం

Special Respect to Mirabhai Chanu-Government of Manipur

0
73
.

భారత్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా మీరాబాయి చాను పేరు వినిపిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి ఎంతో కీర్తి తీసుకువచ్చింది ఆమె. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆమెని అందరూ ప్రశంసిస్తున్నారు. కోట్లాది మంది ఆమెని అభినందిస్తున్నారు. మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు విశిష్ట గౌరవం దక్కనుంది.

ఆమెను అడిషనల్ ఎస్పీగా నియమించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆమెకి కోటి నజరానా ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆమెను ఏఎస్పీగా నియమిస్తున్నామని వెల్లడించారు.

మణిపూర్ కు చెందిన జూడో క్రీడాకారిణి లిక్మబమ్ సుశీలా దేవికి పోలీసు కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా పదోన్నతి కల్పిస్తున్నామని, రూ.25 లక్షల నజరానా కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు సీఎం. ఇక మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో 49 కిలోల విభాగంలో రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. ఇక ఆమె స్వదేశానికి తిరిగి రావడంతో పెద్ద ఎత్తున ఆమెకి స్వాగతం పలికారు అభిమానులు.