ఆ తిమింగళం వాంతి విలువ 10 కోట్లు – ఆశ్చర్యంగా ఉంది కదా ఏమిటో చూద్దాం

Sperm Whale vomit worth Rs 10 crore

0
114
Sperm whale

 

అసలు ముందు వాంతి అనే పేరు వింటేనే అదోరకమైన కంపరం అసహ్యం వేస్తుంది.మరి ఇదేమిటి ప్రపంచంలో ఎక్కడా లేని వింత ఏకంగా వాంతి విలువ పది కోట్లు అంటున్నారు అని ఆలోచన వస్తోందా, అవును ఈ సృష్టిలో ప్రతీదీ దేనికోదానికి పనికి వస్తుంది.మనం ఛీ అనుకునేవి కూడా కొందరు కోట్లు పెట్టి కొంటారు ఇది అలాంటిదే .

యెమెన్కు చెందిన 35 మంది జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లారు. వారికి నీటిలో తేలుతున్న వస్తువు కనిపించింది.వెంటనే దానిని వలతో పైకి తీశారు,అందులో ఉన్న కొందరు దానిని పరిశీలించి ఇది స్పెర్మ్ వేల్ వాంతి అని నిర్ధారించారు. ఇక బయటకు వచ్చిన తర్వాత దీనిని టెస్ట్ కి పంపించారు, స్పెర్మ్ వేల్ వాంతి అని అధికారులు నిర్దారించారు.

దీని విలువ అక్షరాల రూ. 10 కోట్లు ధర పలికింది. మొత్తం 35 మంది డబ్బులు సమానంగా తీసుకుంటున్నారు, కొంత నగదు అక్కడ జాలర్ల పిల్లల చదువుకి ఖర్చు చేస్తాం అన్నారు. ఈ స్పెర్మ్ వేల్ దారుణంగా కంపు కొడుతుంది. కాని ఈ వాంతి దాని కడుపు నుంచి వచ్చిన గంటకి నీటిలో ఉంటే గడ్డ కడుతుంది, ఆ తర్వాత చాలా సువాసన వస్తుంది. దీనిని పెర్ఫ్యూమ్ కంపెనీలు కొంటాయి.