తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు..!

Spot for Telangana government ..!

0
75

ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్టే విధిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పనులు వెంటనే ఆపాలని..అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం పనులు చేపట్టొద్దంటూ ఎన్జీటీ చెన్నై బెంచ్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఎన్జీటీ సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చెప్పిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఎన్జీటీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై స్టే విధించింది. కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం పనులు చేపట్టొద్దంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది.

ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం పలు అభ్యంతరాలను లేవనెత్తింది. తాగునీటి కోసమని..ప్రాజెక్టు ప్రారంభించారని..ఇప్పుడు సాగునీటి కోసం పథకం పనులు జరుగుతున్నాయంటూ పిటిషనర్ వాదనలు వినిపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందంటూ వివరించారు.