యువత ఆత్మహత్యలకు సైతం కరగని టీఆర్ఎస్ సర్కార్ గుండెలు

-

‘కేసీఆర్ సర్కార్ నిరుద్యోల పాలిట శాపంగా మారిందని” విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఇంటికో ఉద్యోగమని మాటిచ్చి, వున్న ఖాళీలని కూడా భర్తీ చేయకుండా దాదాపు నలఫై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో గత ఏడేళ్ళుగా టీఆర్ఎస్ సర్కార్ చెలగాటం ఆడుతుంది. నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టి కేసీఆర్ సర్కార్ క్షుద్రరాజకీయాలు చేస్తుంది. నిరుద్యోగుల ఆత్మహత్యలకు సైతం చలించడం లేదు. కనీస మానవత్వం లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది” అని ధ్వజమెత్తారు దాసోజు.
”కేసీఆర్ సర్కార్ దుర్మార్గానికి గత ఏడేళ్ళుగా యాబై మందికి పైగా నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నాలుగు నెలల్లో దాదాపు పదిమంది యువత ప్రాణం తీసుకున్నారు. నిరుద్యోగులు ఇంతలా అవస్థలు పడుతున్నా కేసీఆర్ సర్కార్ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుందని” ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు.

- Advertisement -

”టీఎస్‌పీఎస్సీ 57/2017 స్టాప్ నర్స్ నోటిఫికేషన్ లో ఎంపికైనప్పటికీ ఉద్యోగం పొందలేకపోయిన బాదితులు , ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ని కలిశారు. తమకు జరిగిన అన్యాయంని కాంగ్రెస్ పార్టీ, దాసోజు శ్రవణ్ ద్రుష్టికి తీసుకెళ్ళారు. వారి సమస్యని ప్రభుత్వంతో పాటు టీఎస్‌పీఎస్సీ ద్రుష్టికి తీసుకెళుతూ … నిరుద్యోగుల సమస్యలని ఉద్దేశించి ప్రభుత్వంతో పాటు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ కి లేఖ రాశారు దాసోజు.
ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రవణ్ మాట్లాడుతూ .. టీఎస్‌పీఎస్సీ చేసిన తప్పిదాలకు నిరుద్యోగ యువత నష్టపోతుంది. 2017 నవంబర్ లో స్టాఫ్ నర్సుల నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఆ ఫలితాలు ఇవ్వడంలో టిఎస్పిఎస్సీ నిర్లక్ష్యం చేస్తుంది. 3311 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు. 26 వేల 412 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో 21,319 మంది పరీక్షకు హాజరయ్యారు. ఐతే..2418 మందికి మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చారు. వెయిటేజీ ప్రకారం .. అర్హత సాధించిన ఇంకా 893 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ టీఎస్‌పీఎస్సీ మాటమార్చి వారి జీవితాలతో ఆడుకుంటుంది. కరోనా లాంటి ఈ విపత్కర పరిస్థితిలో నర్సుల సేవలు అత్యవసరం. వెంటనే అర్హతపొందిన 893 మంది అభ్యర్ధులుకు ఉద్యోగాలు కల్పించాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

”ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ? కొత్త నోటిపికేషన్ లు ఎప్పుడు విడుదల చేస్తారు ? అని తెలంగాణ నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తుంటే.. సీఎం కేసీఆర్ సర్కార్ మాత్రం మాకు తోచినప్పుడే భర్తీ చేస్తాం, తోచినప్పుడే నోటిఫికేషన్ ఇస్తామనే రీతిలో వ్యవహరించి నిరుద్యోల పాలిట శాపంగా మారింది టీఆర్ఎస్ పార్టీ” అని విమర్శించారు దాసోజు.
‘దాదాపు ఏడాదిన్నర పాటు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవిని ఖాళీగా పెట్టారు. సగంపైగా సభ్యులని ఖాళీ పెట్టారు. రిక్రూట్మెంట్ చేసేవాడే లేకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి? కాంగ్రెస్ పార్టీ, ప్రజల డిమాండ్ తో ఎట్టకేలకు చైర్మన్ గా జనార్ధన్ రెడ్డితో పాటు కొంతమందిని సభ్యులని నియమించారు. భయం, భక్తి, భాద్యతతో జనార్ధన్ రెడ్డి పనిచేయాల్సిన అవసరం వుంది. నీళ్ళు , నిధులు, నియామకాలు అనే నినాదంతో యువత, నిరుద్యోగుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జనార్ధన్ రెడ్డి కూర్చునే కుర్చీ 40 లక్షల మంది ఆశల పల్లకి అనే సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగులకు న్యాయం జరక్కపోయినా..ఏ మాత్రం భాద్యత రాహిత్యంగా వ్యవహరించినా .. అత్యంత పాపం చేసిన వ్యక్తిగా జనార్ధన్ రెడ్డి మిగిలిపోతారు” అని తెలియజేశారు శ్రవణ్.

”బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం లక్షా తొంబై రెండు వేల ఉద్యోగ ఖాళీలు వున్నాయి. లక్షా యాబై కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. కొత్తగా ఏర్పడి కొత్త జిల్లాలు, మండలాలు, పెరిగిన పరిపాలన యంత్రాంగం కారణంగా రెండులక్షల వరకూ కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చు. ఈ రకంగా చూసుకుంటే దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీలు జరగాలి” అని వివరించారు.

”వాస్తవానికి విభజన చట్టం ప్రకారం.. 2014నాటికే 4లక్షల 91వేల ఉద్యోగాలు వుండాలి. అలా చూసుకుంటే ప్రతి వెయ్యి మందికి 14మంది ఉద్యోగస్తులు వున్నట్లు. కానీ ఇవాళ 61% మాత్రమే ఉద్యోగస్తులు వున్నారు.. మిగతా 39% ఉద్యోగాలు ఖాళీ వున్నాయి. అంటే ప్రతి వెయ్యి మందికి కేవలం ఎనిమిది మందే ఉద్యోగస్తులు వున్నారు.” అని పేర్కొన్నారు.

”జిల్లా కలెక్టర్లు అటెండర్ గా మారిపోయిన పరిస్థితి. వాళ్ళే ఆఫీస్ తలుపు తెరిచి ఆఫీస్ మొత్తాన్ని చూసుకొనే పరిస్థితి. గతంలో కలెక్టర్ ఆఫీస్ కి వెళితే వందల సంఖ్యలో ఉద్యోగస్తులు కనిపించేవారు. ఇప్పుడు పరిపాలన వ్యవస్థ అంతా గాడితప్పింది. ఎమ్మార్వో, ఆర్డీవో ఆఫీసుల పరిస్థితి కూడా ఇంతే. కేసీఆర్ సర్కార్ కేవలం రాజకీయాలపైనే ద్రుష్టి పెట్టి పాలనని గాలికి వదిలేసింది. దయచేసి ఖాళీలని వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతని ఆదుకోవడంతో పాటు సుపరిపాలనని అదించే దిశగా అడుగులు వేయాలి” అని కోరారు దాసోజు.

”వెటర్నరీ, అగ్రికల్చర్ యూనివర్షిటీలు టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ళు అని నోటిఫికేషన్ ఇచ్చాయి. ఇదో కుట్రకి సంకేతం. రానున్న రోజుల్లో టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయబోయే ఉద్యోగాలకు వయోపరిమితి 34 ఏళ్ళు గా చేసేయడానికి కేసీఆర్ సర్కార్ కుట్ర చేస్తుంది. ఇది నిరుద్యోగుల పాలిట శాపం. తెలంగాణ యువత 2009నుండి 2014 వరకూ ఉద్యమంలో వున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ కొత్త ఉద్యోగాలు లేవు. గత ఏడేళ్ళుగా కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులని విస్మరించింది. తెలంగాణ బిడ్డలకు ఉపాధి కల్పించడానికి ఒక పాలసీ నిర్మాణం చేపట్టకపోగా.. ఎప్పటికప్పుడు పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను అర్థం చేసుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైయింది. ఇప్పుడు వున్న ఫలంగా వయోపరిమితి 34గా చేస్తే 34దాటిన వారు ఎక్కడికి పోవాలి. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమంలో పాల్గొన్న ఏం కావాలి ? గరిష్ట వయోపరిమితి 34గా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. తస్మాత్ జాగ్రత్త. యువతతో పాటు రోడ్లపైకి వచ్చి మీ మెడలు వంచుతాం” అని హెచ్చరించారు దాసోజు.

ఈ వయోపరిమితి నిర్ణయాన్ని కొత్తగా చైర్మన్ బాధ్యతలు చేపట్టిన జనార్ధన్ రెడ్డి వెనక్కి తీసుకొని, వయో పరిమితిని 34 నుంచి 44 గాచేసి , కొత్త నోటిఫికేషన్స్ విడుదల చేయాలనీ కోరారు దాసోజు.

‘హెల్త్ డిపార్టమెంట్ లో యాబై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సిఏం కేసీఆర్ ప్రకటన చేశారు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ? గత ఏడేళ్ళుగా గ్రూప్ 1 , గ్ర్రూప్ 2 నోటిఫికేషన్లు లేవు. అనేక టీచర్ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. అనేక శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగ భర్తీ జరగాలి. వీటన్నిటిని కలుపుకొని సమగ్రంగా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలి.
”అందరి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అసాధ్యం కావచ్చు.. అయితే ప్రైవేట్ ఉద్యోగాలు ఎలా కల్పించాలి. స్కిల్ డెవలాప్ ఎలా పెంచాలి ? ఈ అంశాలపై పూర్తి స్థాయిలో పరిశోధన, విశ్లేషణ, పాలసీ అవసరం. దీని కోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయండి”’అని సూచించారు దాసోజు.

తోడేళ్ళు నుంచి కాపాడుకోవడానికే ఈటెల ఢిల్లీ పయనం.: దాసోజు
తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజేందర్ తోడేళ్ళ నుండి తప్పించుకోవడానికి ఢిల్లీ వెళ్లుంటారని అభిప్రాయపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఈటెల రాజేందర్ చుట్టూ జరుగుతున్న పరిణామాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన దాసోజు.. కేసీఆర్ సర్కార్ తన అధికారంను దుర్వినియోగం చేస్తూ పోలీసులు, అధికారులతో అన్ని వైపుల నుండి వత్తిడి పెడుతున్న నేపధ్యంలో తనని తాను కాపాడుకునే ప్రయత్నంలో ఈటెల ఢిల్లీ వెళ్లుంటారు తప్పితే బిజెపి పై ప్రత్యేక ప్రేమ వుందని తాను అనుకోవడం లేదని చెప్పారు దాసోజు. ”ఇది దుర్మార్గమైన సంస్కృతి. కేసీఆర్ దగ్గర వుంటే తప్పులు అన్నీ మాఫీ అయిపోతాయి . వ్యతిరేకిస్తే అన్ని వైపుల నుండి దాడులు. ఈ అహంకారం, అణిచివేత, ఆధిపత్య ధోరణి తెలంగాణ రాజకీయాలకు మాయని మచ్చ” అని అభిప్రాయపడ్డారు దాసోజు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...