ప్రముఖ కవి డాక్టర్ వేణు సంకోజుకు ‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు’

0
89

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. పలు సినిమాలకు గేయరచయితగా పనిచేశాడు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణాలో సాహిత్యరంగంలో కృషి చేసిన వారికి దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది.

శ్రీ దాశరథి కృష్ణమాచార్యకు గుర్తింపుగా, ఆయన దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ఆయన జన్మదినం సందర్భంగా, తెలంగాణ కవులు, రచయితలు, సాహితీవేత్తలను గుర్తించి, ప్రతి ఏడాది ప్రకటించే ప్రతిష్టాత్మక సాహితీ అవార్డు ‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ను 2022 సంవత్సరానికి గాను, ప్రముఖ కవి డాక్టర్ వేణు సంకోజుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవార్డు కింద రూ. 1,01,116 (ఒక లక్ష వెయ్యి నూటా పదహార్లు) నగదు పారితోషకంతో పాటు జ్ఞాపికను అందజేస్తారు. ఈ సందర్భంగా జరిగే సత్కార కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన నిర్వహిస్తారు.