ఏపీలో 13 జిల్లాల్లో కేవలం 11 జిల్లాలకే వైరస్ సోకింది శ్రీకాకుళం విజయగనరం సేఫ్ లో ఉన్నాయి అని అందరూ అనుకున్నారు… కాని శ్రీకాకుళంలో కూడా పాజిటీవ్ కేసులు రావడంతో ఇప్పుడు ఏపీ ఉలిక్కిపడింది. శ్రీకాకుళం జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
జిల్లాలో ఆ ప్రాంతం పాతపట్నం.
దీంతో పాతపట్నంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు అవుతోంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అక్కడకు వెళ్లారు కూడా, అక్కడ అధికారులతో మాట్లాడనున్నారు, అయితే ఈ వైరస్ లక్షణాలు ఉన్న పాతపట్నం యువకుడికి ముందు పరీక్షలు జరిపారు, అప్పుడు నెగిటీవ్ వచ్చింది. కాని అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటీవ్ వచ్చింది.
తొలి వ్యక్తి ఢిల్లీ రైల్వేలో పనిచేస్తున్నారు. మార్చి 19న స్వస్థలానికి వచ్చారు. ఆయన ఆయన ప్రయాణించిన రైళ్లలో మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన వారు ఉన్నట్టు అనుమానం. అందుకనే ఆ కుటుంబ సభ్యులని అప్రమత్తమై హోం క్వారంటైన్‌లో పెట్టారు. ఇక ఈ వ్యక్తులు తిరిగిన గ్రామాలు, సీది , కాగువాడ, అలాగే వాటిని ఆనుకుని ఉన్న 27 గ్రామాల్లో అంటే మూడు కిలోమీటర్ల మేర వాటిని దిగ్భందం చేశారు.