శ్రీకాళహస్తి వ్యక్తికి కరోనా ఏపీలో మరో కేసు

శ్రీకాళహస్తి వ్యక్తికి కరోనా ఏపీలో మరో కేసు

0
92

ఏపీలో నెమ్మదిగా కరోనా పాజిటీవ్ కేసులో సంఖ్య పెరుగుతోంది, ఇక తాజాగా లండన్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకింది అని తేలింది..మరో 14 మంది శాంపిల్స్ కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఈరోజు ఒక్క కేసు కూడా రాలేదు అని అనుకున్న ఆరోగ్య శాఖ అధికారులకి ఇది ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది, దీంతో మరో కేసు పాజిటీవ్ అని తేలింది, లండన్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటీవ్ రావడంతో ఈ కేసుల సంఖ్య 8 కి చేరింది. అతనిది శ్రీకాళహస్తి అని తెలుస్తోంది.

కడప, విశాఖ, గుంటూరులో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు.. దేశంలో 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో ఇప్పుడుఏపీ తెలంగాణ ఇలా దేశం అంతా ఇదే పాటిస్తారు, ఎవరిని బయటకు అనుమతించరు, ఇక నిత్య అవసర వస్తువులకి మాత్రమే ఉదయం 7 నుంచి 9 వరకూ అనుమతి ఇస్తారు.