శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్

0
94

ఏపీ టీడీపీ నేత నారా లోకేశ్ తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…. వీధుల్లోకి రాకుండా ఇంట్లోనే ఆ సీతారాములను పూజించి వారి అనుగ్రహాన్ని పొందాలని అన్నారు. కరోనా మహమ్మారిని త్వరగా అంతం చేయమని రామచంద్రుని వేడుకోండని అన్నారు లోకేశ్…

శ్రీరాముడంటే ఆదర్శం… ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రజాభిప్రాయానికి విలువనివ్వకుండా నియంతల్లా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న పాలకులను మనం చూస్తున్నామని అన్నారు.

అలాంటిది ఆనాడే ప్రజల అభిప్రాయాలకు జీవితాన్ని మించి విలువిచ్చాడు శ్రీరాముడు అని తెలిపారు… అందుకే రామరాజ్యంలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించారని గుర్తు చేశారు లోకేశ్