తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పోటీ తామే నని బల్లగుద్ది మరీ చెబుతోంది బీజేపీ…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని కొద్దికాలంగా చెబుతూ వస్తోంది…. అందుకు తగ్గట్లుగానే రాష్ట్రానికి చెందిన ఇతర నేతలను పార్టీలో చేర్చుకుంటు పార్టీపరంగా మార్పులు చేర్పులను చేస్తోంది…
అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్ష పదవిని వేరే వారికి కట్టబెట్టేందుకు సిద్దమైందని వార్తలు వస్తున్నాయి… ప్రస్తుత అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నారు…. బీజేపీ రాజ్యంగం ప్రకారం మూడేళ్లు దాటితే అధ్యక్ష పదవిలో మార్పులు చేయాలి అందులో భాగంగా ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించనుందని వార్తుల వస్తున్నాయి…
అయితే మరోసారి ఆయనకే ఆ ఛాన్స్ ఇవ్వాలని మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు… కాగా మరోవైపు అధ్యక్ష పదవిరేసులు డీకే ఆరుణ బండిసంజయ్ రాంచంద్ రావు వంటి వారు రేసులో ఉన్నారు…