ఆ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్..!

State government shock to those employees!

0
93

ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం కత్తిరిస్తోంది. బయోమెట్రిక్‌ హాజరు నమోదు కాని రోజులన్నిటికీ జీతాలను నిలిపేస్తోంది. అక్టోబరు నెలలో సచివాలయ ఉద్యోగుల్లో సగం మంది సగం వేతనాలే తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో అన్ని కేడర్లలో 1.36 లక్షల మంది సచివాలయ ఉద్యోగులున్నారు. వీరంతా ప్రతిరోజూ ఉదయం పది గంటలకు బయోమెట్రిక్‌ ద్వారా హాజరు వేయాలి. వాతావరణ పరిస్థితులు, నెట్‌వర్క్‌ సమస్యలు, గ్రామంలో సిగల్స్‌ ఆధారంగా ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో లేని పరిస్థితుల వల్ల అత్యధిక శాతం ఉద్యోగులు బయోమెట్రిక్‌ను సకాలంలో వేయలేకపోతున్నారు. వీటికి తోడు బయోమెట్రిక్‌ పరికరాలు సరిగ్గా పని చేయడం లేదని ఉద్యోగులు మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. ఉద్యోగులే సొంత ఖర్చులతో బయోమెట్రిక్‌ పరికరాన్ని కొనుక్కుంటే దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి రీయంబర్స్‌మెంటు అందడం లేదు.

అధికార పార్టీ నేతల ఒత్తిడితో సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువగా హెల్త్‌, వెల్ఫేర్‌, శానిటరీ అసిస్టెంట్లు, అడ్మిన్‌ సెక్రటరీలు సతమతమవుతున్నారు. సంబంధిత శాఖ ఇచ్చిన పనుల కన్నా..నేతలు చెప్పిన పనులే ముందు చేయాలనడంతో శాఖ పనులు సకాలంలో చేయలేకపోతున్నామని వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులపై అధికారపక్ష నేతలు భౌతికదాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో 13,500 మంది హెల్త్‌ సెక్రటరీలున్నారు. ఉదయాన్నే క్షేత్రస్థాయిలోకి వెళ్లి వ్యాక్సిన్లు వేయాలని వీరికి వైద్యారోగ్యశాఖ చెబుతోంది. ఉదయం 6 గంటలకే ఫీల్డుకు వెళ్తున్న వీరు పది గంటలకు బయోమెట్రిక్‌ వేసే పరిస్థితుల్లేవు. బయోమెట్రిక్‌ వేయలేదనే కారణంతో జీతాలు కోల్పోతున్నారు.