కరోనా కొత్త టెన్షన్ : పేగుల్లో రక్తం గడ్డలు

covid patients blood clots in covid patients brain blood clots in covid patients heart

0
123

మానవ శరీరంపై కరోనా పంజా విసురుతున్న తీరును ఇంకా ఏ శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు గుర్తించలేకపోతున్నారు. ఏ ఏ రకాలుగా కరోనా మానవ శరీరంపై దాడిచేస్తుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. తాజగా పేగుల్లో కరోనా రోగుల పేగుల్లో రక్తం గడ్డలు కట్టుకుంటుందని వైద్యలు దృష్టికి వచ్చింది. ముంబైలో ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో వెలుగుచూశాయని డాక్టర్లు చెబుతున్నారు.

సాధారణంగా గుండె, మెదడు, కాళ్లలో రక్తం గడ్డలు కడుతుందని మనం విన్నాం… కానీ కోవిడ్ సోకిన వారిలో కడుపులోని పేగుల్లో కూడా రక్తం గడ్డలు కడుతున్నట్లు గుర్తించారు. భరించరానంతగా కడుపు నొప్పి వచ్చినప్పుడు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని కోరుతున్నారు.

ముంబై నగరంలో సునీల్ గవాలీ అనే 59 ఏళ్ల వ్యక్తికి ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. అప్పటికే ఆయన రెండు డోసుల కోవిషీల్డ్ వాక్సిన్ చేయించుకున్నారు. ఎలాంటి కోవిడ్ లక్షణాలు కూడా లేవు.

అయితే ఆయనను పరీక్షించిన వైద్యుడు అనిరుధ్ భుయాన్ కు అనుమానం వచ్చి సిటీ స్కాన్ చేయించారు. పేగులకు రక్తం సరఫరా చేసే ప్రధాన దమనుల్లో చాలాచోట్ల రక్తం గడ్డలు కట్టిందని గుర్తించారు. అయితే ఆపరేషన్ అవసరం లేకుండానే మందులతో వాటిని కరిగించినట్లు వివరించారు. అలాగే కోవిడ్ పరీక్ష చేయగా పాజిటీవ్ వచ్చిందన్నారు. గడిచిన 8 నెలల కాలంలో కోవిడ్ వచ్చి, పేగుల్లో రక్తం గడ్డలు కట్టిన ఇలాంటి కేసులు 9 వరకు వచ్చాయన్నారు. వీరిలో ఎవరికీ శ్వాస సంబంధ సమస్యలు రాలేదని కేవలం కడుపు నొప్పితో మాత్రమే వచ్చారని చెప్పారు.

కరోనా రోగుల్లో 16 నుంచి 30 శాతం మందికి శ్వాస సంబంధ సమస్యలు లేకపోయినా జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్నట్లు తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో తేలిందని తెలిపారు.