ఇప్పటికీ మన దేశంలో కొన్ని వింత ఆచారాలు ఉన్నాయి, ఇలాంటి వాటిలో కొన్ని మూడనమ్మకాలుగా పాటించే ఆచారాలు ఉన్నాయి, అయితే పిల్లల కోసం చాలా మంది అనేక పూజలు వ్రతాలు చేస్తారు, ఇక్కడ వరకూ ఒకే కాని అసలు సంబంధం లేని మూడనమ్మకాలు ఆచారాలు పాటిస్తారు… అందులో ఇప్పుడు దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు.
సంతానం కోసం ఏకంగా ఇక్కడ పూజారుల దగ్గర ఈ మహిళలు ఏం చేస్తారంటే …చత్తీస్ ఘడ్ దంతారీ జిల్లాలో
సంతానం లేని మహిళలు గుడిలో కింద పడుకుని ఉంటారు… వారిని పూజారులు పొట్టపై తొక్కుతారు, అలాగే నడుముపై తొక్కుతారు…ఇలా చేస్తే సంతానం కలుగుతుంది అని అక్కడ వారి నమ్మకం..పిల్లలు లేని వారు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తారు.
దీపావళి తర్వాత మద్దారి జాతర జరుగుతుంది ఇక్కడ..అందరూ అంతారమూతీ దేవత కు పూజలు చేస్తారు..
ఇలా చేయడం వల్ల చాలా మంది గర్భం దాల్చారట …దాదాపు 200 మహిళలు గత ఏడాది కూడా ఇలాగే వచ్చారు, దీంతో ఇది మంచిది కాదని దీని వల్ల మహిళలకు అనేక సమస్యలు వస్తాయి అని ఈ మూడనమ్మకం నమ్మద్దు అని చెబుతున్నారు అధికారులు.. అయినా వారు మాత్రం ప్రతీ ఏడాది దీనిని పాటిస్తున్నారు.
|
|
వింత ఆచారం -సంతానం కోసం మహిళలు ఇక్కడ పూజారుల దగ్గర ఏం చేస్తారంటే
-