కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు. కొత్తగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే ఇవి చాలదన్నట్టుగా ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఇండియా కు ఒమిక్రాన్ ముప్పు తప్పేలా లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మళ్లీ ఆంక్షలు పెట్టేందుకు సిద్ధం అయింది. తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే అంటూ హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారని గుర్తు శారు. ఇక, వ్యాక్సిన్ కంటే అత్యంత రక్షణ కవచం మాస్క్. మాస్క్ ఖచ్చితంగా ధరించాలని లేకుంటే వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసులకు సూచించారు.