ఉత్తరకొరియా దేశంలో ఎలాంటి ఆంక్షలు ఉంటాయో తెలిసిందే.. అక్కడ దేశంలో కిమ్ కుటుంబాన్ని కాదు అని ఏమీ చేయలేరు.. ఆ దేశ అధ్యక్షుడి మాటే శాసనం, అక్కడ చట్టాలు కటిన ఆంక్షలు మరే దేశంలో కూడా ఉండవు.
ప్రపంచమంతా ఓ దారిలో పయనిస్తుంటే ఆయన మాత్రం మరో దారిలో వెళతారు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్ తెలియని వారు ఉండరు.
ఇక ప్రజలు అయినా సొంత కుటుంబం వారు అయినా శిక్షల్లో ఒకే విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది.. సొంత బాబాయ్ తప్పు చేస్తే అతన్నికుక్కలకు ఆహారంగా వేశాడు అని చెబుతారు…పోర్న్ చూస్తూ పట్టుబడిన ఓ బాలుడికి భయంకరమైన శిక్ష విధించాడు ఈ నార్త్ కొరియా డిక్టేటర్.
ఉత్తర కొరియా లో ఇలాంటి వెబ్ సైట్లు చాలా వరకూ బ్యాన్ చేశారు, కాని ఓ బాలుడు పోర్న్ చూస్తూ అడ్డంగా దొరికాడు. కంప్యూటర్ ఐపీ అడ్రెస్ ద్వారా అతడి ఇంటి చిరునామాను పోలీసులు ట్రేస్ చేశారు…. మొత్తానికి ఈ విషయం కిమ్ వరకూ వెళ్లింది, దీంతో ఆ కుటుంబానికి దారుణమైన శిక్ష విధించాడు కిమ్.
ఆ కుటుంబాన్ని నార్త్ కొరియా నుంచి వెలివేయడమే కాకుండా సరిహద్దు ప్రాంతానికి తరిమేశాడు. దీంతో చాలా మంది షాక్ అయ్యారు, అయితే ఆ కుటుంబాన్ని ఉరి తీస్తారు అని అందరూ అనుకున్నారు… కాని కిమ్ మాత్రం వారిని దేశం నుంచి వెలివేశారు. అంతేకాదు మరో విషయం ఏమిటి అంటే ఆ బాలుడు చదివిన పాఠశాల ప్రిన్సిపాల్కు సైతం కిమ్ శిక్షను విధించాడు.
అతనిని కార్మిక జైలుకి పంపించారు అని తెలుస్తోంది.
ReplyForward
|