నారాయణపేటలో కేటిఆర్ కు ఝలక్ (వీడియో)

Students Youth Big Shock To KTR

0
88

తెలంగాణ సిఎం కేసిఆర్ కొడుకు, మంత్రి కేటిఆర్ కు నారాయణపేట జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. శనివారం కేటిఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయినా పోలీసుల భద్రతను ఛేదించుకుని విద్యార్థులు కేటిఆర్ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎబివిపి కార్యకర్తలు ఒక్కసారిగా జెండాలను తీసుకుని కేటిఆర్ కాన్వాయ్ కి అడ్డుతగిలారు. నారాయణపేటలో చిల్డ్రన్స్ ఆసుపత్రిని ప్రారంభించిన కేటిఆర్ తర్వాత మరో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సందర్భంలో ఈ నిరసన ఎదురైంది.

దీంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. లాఠీలకు పనిచెప్పి దొరికనోడిని దొరికనట్లు చితకబాదారు. పోలీసుల లాఠీఛార్జితో నారాయణపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లాఠీఛార్జి అనంతరం ఎబివిపి నేతలు కేటిఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

లాఠీఛార్జి వీడియో కింద ఉంది చూడొచ్చు.

https://www.facebook.com/alltimereport/videos/785617338795112