ఫ్లాష్: ప్రధాని పదవి రాజీనామా చేయాలంటూ విద్యార్థుల నిరసనలు..

0
72

ప్రస్తుతం శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీలంకలో ఆహారం, చమురు కొరతతో ప్రజలు నానాతిప్పలు పడుతున్న విషయం తెలిసిందే.  అందుకే గత కొంత కాలంగా  నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న నిరసనతో దేశం దద్దరిల్లుతుంది.

శ్రీలంకలో రాజపక్స కుటుంబానికి వ్యతిరేకంగా వేలసంఖ్యలో యూనివర్సిటీ విద్యార్థులు ఇంటిని చుట్టుముట్టి బారికేడ్లను దాటుకుంటూ లోపటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆపడానికి ప్రయత్నించినా ఆగకుండా ‘గో హోమ్‌ గొట’ అంటూ బూమిదద్దరిల్లేలా నినాదాలు చేసారు.

ఇంటి గోడపైకి ఎక్కి రాజపక్సకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాకుండా ప్రధాని పదవిని రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసారు. అనంతరం ప్రధాని మహీంద ఇంట్లో లేదని పోలీసులు చెప్పడంతో వారు అక్కడి నుండి వెళ్లిపోయారు.