జిల్లాల నుంచి వైజాగ్ వెళ్లలేనంత దూరంలో ఉందని రెచ్చగొట్టడానికి కిరసనాయిలు మ్యాప్ వేసి పేజి అంతా పర్చిందని ఎల్లో మీడియాపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు… హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలు మధ్యలో లేవని ప్రజలందరికీ తెలుసని అన్నారు. దీనికంటే కడుపు మంటను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని సిఎం
కోరవచ్చు కదా ప్రశ్నించారు…
అప్పట్లో రాజధాని నిర్మాణం పేరు చెప్పి ఇటుకులు విక్రయించారని. స్కూల్ పిల్లల నుంచి కూడా విరాళాలు సేకరించారని అన్నారు. వసూలైన వందల కోట్లు ఏమయ్యాయో తెలియదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాజధాని నిర్మాణం ఊసే లేదు. ఇప్పుడు రాజధానిని కాపాడుకునేందుకని మళ్లీ జోలె పట్టారని ఇటువంటి వింతలు చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలరని అన్నారు…
అమరావతిని రక్షించుకోలేకపోతే చనిపోయినట్టేనని…. రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలని అంటున్నాని మండిపడ్డారు…. మీ బినామీలు, సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడటానికి ప్రజలంతా సమిధలు కావాలా? మీ లాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి అని విజయసాయిరెడ్డి ఆరోపించారు…