బ్రేకింగ్: మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆత్మహత్య యత్నం కలకలం..

0
91

వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ నాయకుడు సేవ్యా నాయక్  కాంగ్రెస్ కౌన్సిలర్ కారు దహనం కేసులో రామ్మోహన్ రెడ్డి తనపై అనవసరమైన అబాండాలు వేస్తున్నాడన్న కారణంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. తామే కారున ధ్వంసం చేసుకొని నా పేరు ప్రచారం చేస్తున్నారని వాపోయాడు. అనంతరం అది గమనించిన స్థానికులు వికారాబాద్ లోని మిషన్ దవాఖానాకు తరలించగా..పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.