సుజనా ఆశలపై నీళ్లు…

సుజనా ఆశలపై నీళ్లు...

0
111

బీజేపీ రాజ్యసభా సభ్యుడు సుజనా చౌదరి మంత్రి పదివిని అశించారా అయితే ఇప్పుడు ఆయన ఆశలు అడియాలు అయ్యాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పోత్తులో భాగంగా సుజనాకు మంత్రి పదవి వరించింది.. ఆ తర్వాత టీడీపీ బీజేపీ నుంచి బయటకు రావడంతో సుజనా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు…

ఆతర్వాత ఆయన బీజేపీలో చేరుతారని అందరు భావించారు… కానీ చేరలేదు… 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో నలుగురు టీడీపీ రాజ్యసభా సభ్యులు బీజేపీ తీర్థం తీసుకున్నారు… పార్టీ తీర్థం తీసుకున్నప్పుడు ఒకరికి మంత్రి పదవి ఇస్తామని చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి… అందులో భాగంగానే త్వరలోనే మంత్రి వర్గ విస్తరన జరుగుతుందని అంటున్నారు…

తెలంగాణ నుంచి బీజేపీ తరపున మంత్రి ఉన్నా ఏపీ నుంచి ఎవ్వరు లేరు దీంతో ఏపీ నుంచి ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు… అయితే మొన్నటివరకు ఆ ఛాన్స్ సుజనాకు దక్కుతుందని అందరు భావించారు… కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయని అంటున్నారు… ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలో సుజనా కూడా ఆశలు వదిలేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి…