జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సుమన్ – నాకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు

జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సుమన్ - నాకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు

0
102
Actor Suman

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో తీసుకుంటున్న నిర్ణయం పై కొందరు వ్యతిరేకిస్తుంటే , మరికొందరు మాత్రం దీనిని స్వాగతిస్తున్నారు, కాని రాజధాని ఇప్పటికే ఐదు సంవత్సరాలుగా ఏమీ డవలప్ అవ్వలేదు.. వైజాగ్ అయితే కచ్చితంగా రెండు మూడు సంవత్సరాల్లో అన్ని సెట్ అవుతాయి అని అంటున్నారు.

ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం దీనిని వత్యిరేకిస్తున్నారు..ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో జగన్ ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. అసలు అక్కడ అమరావతి రైతులకి ఏం కావాలో తెలుసుకోవాలి అని అన్నారు.

రాజధాని రైతులకు మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. జగన్ ను కలిసేందుకు ఐదు సార్లు ప్రయత్నించానని చెప్పారు సుమన్ … కానీ అపాయింట్ మెంట్ దొరకలేదని చెప్పారు. మాచర్లలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు. అయితే సుమన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం , పైగా ఐదు సార్లు కలవాలి అని అనుకున్నా సీఎం జగన్ ఎందుకు నిరాకరించారు అనేదానిపై చర్చ జరుగుతోంది.