ఈ రోజుల్లో ఏ ఇంటిలో చూసినా ఏసీలు కనిపిస్తున్నాయి… చాలా వరకూ ఏసీలు వాడకం బాగా పెరిగింది.. మధ్యాహ్నం సమయంలో పూర్తిగా ఏసీలు నడుస్తున్నాయి. సాఫ్ట్వేర్ హబ్లలో కంపెనీలలో ఏసీల వాడకం చాలా ఎక్కువ. ఇక 24 గంటలు ఇవి ఆన్ లోనే ఉంటాయి కంపెనీలో… అయితే ఏసీలో ఉంటే కొన్ని సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు, అతిగా ఏసీలో ఉన్నా ప్రమాదమే.
అతిగా ఏసీలో ఉంటే కళ్లలో మంటలు, కళ్లకు దురదలు వంటివి ఎక్కువవుతున్నాయి. డ్రై ఐస్ సమస్య ఉన్నవారు ఏసీలకు దూరంగా ఉండాలి. అనేది మర్చిపోకండి.. మైగ్రేన్ తలనొప్పి కూడా కొంత మందికి వస్తుంది అందుకే అతిగా ఇందులో ఉండద్దు. ఉన్నా గంటకి ఓసారి అయినా బయటకు రావాలి.
ఎక్కువ సేపు ఏసీలో ఉండేవారికి లోబీపీ వచ్చేందుకు కూడా ఏసీ కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు.. ఏసీలో ఉండేవాళ్లు ఎక్కువగా నీళ్లు తాగకపోతే, వాళ్లకు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వస్తుంది. చర్మం పొడిబారిపోతుంది..సో క్రీములు అవి వాడితే మీకు అలర్జీ సమస్యలు వస్తాయి.. వీటికి దూరంగా ఉండాలి. ఆస్తమా సమస్య ఉన్న వారు ఏసీకి దూరంగా ఉంటే మంచిది.