లోక్‌సభలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. స్పీకర్ హెచ్చరించినా అనుచిత ప్రవర్తనతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనితో వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు మాణిక్కం ఠాకూర్, టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్‌ను సస్పెండ్ చేయాలని లోక్‌సభ తీర్మానించింది.