మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు..విశాఖ మేయర్గా, అనకాపల్లి ఎంపీగా పనిచేసిన ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది, ఆయన రియల్ స్టోరీ చూద్దాం.
విశాఖ జిల్లాలోని 1952లో తగరపువలస సమీపంలోని చిట్టివలసలో సబ్బం హరి జన్మించారు.
ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు సబ్బం హరికి .
విశాఖలోని ఏవీఎన్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే గ్రాడ్యుయేషన్ తర్వాత విశాఖ నగరంలో బియ్యం వ్యాపారం ప్రారంభించారు. అక్కడ నష్టాలు వచ్చాయి తర్వాత ఆయన లారీలతో ట్రాన్ పోర్ట్ రంగంలోకి వచ్చారు, అది లాభాలు తీసుకురాలేదు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు
అందులో కూడా ఆర్థిక నష్టాలే మిగిలాయి.
ముందు నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు..
1995లో విశాఖ మేయరుగా సబ్బంహరి పని చేశారు
2009 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఆ ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అల్లు అరవింద్ బరిలో నిలిచారు.
ఇక వైయస్ మరణం తర్వాత వైయస్ జగన్ వెంట ఉన్నారు. తర్వాత పలు విభేదాలతో ఆయన జగన్ నుంచి దూరం అయ్యారు. ఇక 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు…2019 ఎన్నికల్లో భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు..సబ్బం హరిది ప్రేమ వివాహం. ఏవీఎన్ కళాశాలలో సబ్బంహరి డిగ్రీ చదువుతున్న సమయంలో అక్కడే బీఏ చదువుతున్న లక్ష్మిని ప్రేమించారు వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.1970లో వీరి వివాహం జరిగింది.వీరికి ముగ్గురు పిల్లలు. అవని, అర్చన, వెంకట్. కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఇక పిల్లలని రాజకీయాలకు దూరంగా ఉంచారు.