పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పోస్ట్ ను జగన్ ఆయనకు ఫిక్స్ చేయనున్నారా…

పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పోస్ట్ ను జగన్ ఆయనకు ఫిక్స్ చేయనున్నారా...

0
99

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీపై ఇటీవలే పలు ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అప్పగించిన ఎస్వీబీసీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… పృథ్వీ రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉంది…

ఇప్పుడు ఆ పదవి ఎవరికి దక్కబోతుంది… ముఖ్యమంత్రి జగన్ ఎవరిని నియమించబోతున్నారని ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు… అయితే తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎస్వీ బీసీ చైర్మన్ గా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమించాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి…

అంతేకాదు ఎస్వీబీసీ ఛానల్ కు మరో రెండు అదనపు డైరెక్టర్ పదవులను నియమించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి… కాగా ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న పృథ్వీ ఓ మహిళతో నువ్వంటే ఇష్టమని తన గుండెల్లో ఉన్నావని… లవ్యూ అంటూ ఫోన్లో పార్ట్ టైమ్ ఉద్యోగినితో మాట్లాడారు…

అంతేకాదు తాను ప్రస్తుతం మధ్యం మానేశానని తాగడమంటూ జరిగితే అది నీవద్దే కూర్చొని తాగుతానంటూ ఈ ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడారు…. అంతేకాదు గతంలో ఛానల్ కార్యాలయంలోనే వెనుక వచ్చి పట్టుకుందామని అనుకున్నానని ఎక్కడ భయపడి అరుస్తావోనని ఆగిపోయానని అన్నారు…