రైతుల‌కు కేసీఆర్ సర్కార్ తీపి కబురు..ఖాతాల్లో డబ్బు జమ

0
105

తెలంగాణ రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి కబురు చెప్పింది. ఈనెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది.