బిగ్ బాస్ షోనా అది బ్రోతల్ హౌసా..!

బిగ్ బాస్ షోనా అది బ్రోతల్ హౌసా..!

0
96
swetha reddy

తెలుగులో బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్. ఈ షో సీజన్ 3 త్వరలో ప్రారంభం కానుంది. ఈ షోకి హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్యవహరించనున్నారు. దీనిపై శ్వేతా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్-3లో పాల్గొనేందుకు తనను సంప్రదించి.. ఎంపిక చేశారని.. ఆ తర్వాత తమ కోరిక తీర్చాలని కోరిననట్లు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్‌ను సంతృప్తి పరిస్తేనే అవకాశం లభిస్తుందని చెప్పినట్లు ఆమె తెలిపారు. ఇంకా ఆమె బిగ్‌బాస్ పేరుతో అక్కడ బ్రోతల్ హౌస్ నడుపిస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నిజమైన క్యాస్టింగ్ కౌచ్‌కు బిగ్ బాస్ సెంట్రల్ పాయింట్ గా మారిందని.. వ్యాఖ్యానించి దుమారానికి దారితీశారు.

అంతేకాకుండా ఇలాంటి వెర్రి పోకడలకు కేంద్రంగా మారిన ఈ షోను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బిగ్ బాస్ ముసుగులో అక్కడ జరుగుతున్న తంతును బయటపెట్టడానికే తాను ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చినట్లు శ్వేతా రెడ్డి వివరించారు. గత ఏప్రిల్‌ నెలలో బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని.. బిగ్‌ బాస్‌ మూడో సీజన్‌కు ఎంపిక చేశామని చెప్పారని.. ఎందుకని అడిగితే.. పాప్యులర్‌ యాంకర్‌ గా మిమ్మల్ని తీసుకున్నట్లు చెప్పారని ఆమె వెల్లడించారు.

కాగా ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రవికాంత్‌ తనకు పలుమార్లు ఫోన్ పిలిపించి మాట్లాడారని.. అగ్రిమెంట్ సమయంలో తాను తాను సంతకాలు కూడా చేశానని.. అయితే.. అ ఒప్పంద పత్రాల జిరాక్స్ కాపీలు తనకు ఇవ్వలేదని వివరించారు. తర్వాత తమ బాస్‌ను ఇంప్రెస్‌ చేయాలని కార్యక్రమ ప్రొడ్యూసర్‌ శ్యామ్‌ తనను అడిగారని.. తానెందుకు ఇంప్రెస్‌ చెయ్యాలని నిలదీశానని శ్వేతారెడ్డి వివరించారు. అంతటితో ఆగకుండా హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా రావాలని తనకు ఫోన్ల మీద ఫోన్లు చేసిన రఘు, రవికాంత్‌, శ్యామ్‌ తర్వాత ఫోన్ చేస్తుంటే స్పందించడం లేదని శ్వేతారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.