Flash News: థూ న్యూస్ గా మారిన టీ న్యూస్..ఆంధ్రోడి పెత్తనంలో నలుగుతున్న ఉద్యోగులు, మెరుపు సమ్మె

0
132

తెలంగాణ గుండె చప్పుడుగా చెప్పుకుంటున్న టీన్యూస్ ఛానల్ యాజమాన్యం ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది. మూడేళ్లుగా సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచలేదు. దీనితో గుండెలు రగిలిన టీ న్యూస్ ఉద్యోగులు ఆఫీస్ లోనే మెరుపు సమ్మెకు దిగారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు కొనసాగింది. ఈ సందర్బంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. బయటి ఛానళ్లలో కంటే టీ న్యూస్ లోనే తక్కువ జీతాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని అడిగితే రేపు పెంచుతాం మాపు పెంచుతాం అంటూ ఊరించి ఉసూరుమనిపించారని మండిపడ్డారు.

దాదాపుగా 15 నుంచి 20 మంది ఉద్యోగులు భయపడకుండా ఆందోళన బాట పట్టారు. తెలంగాణ కోసం పుట్టిన న్యూస్ ఛానల్ లో ఆంధ్రోడిని తీసుకొచ్చి నెత్తిన కూసబెట్టారని ఆగ్రహించారు. ఆంధ్రోడు వచ్చిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి పెంక మించి పొయ్యిలో పడ్డట్లు అయిందని ఆవేదన చెందుతున్నారు. అధికార టిఆర్.ఎస్ పార్టీకి చెందిన ఛానల్ అయినప్పటికీ జీతాలు పెంచకపోవడం పట్ల ఉద్యోగులు సీరియస్ అయ్యారు. మరోవైపు అధికార పార్టీ ఛానల్ గా వెలుగొందుతున్న సాక్షి దినపత్రిక టీవీ ఛానల్ లో జర్నలిస్టులకు, ఉద్యోగులకు ఇంక్రిమెంట్ల మీద ఇంక్రిమెంట్లు ఇస్తుంటే టీ న్యూస్ లో మాత్రం దరిద్రం తాండవిస్తుందని విమర్శించారు.

ఒకప్పుడు 2010లో ప్రారంభం అయిన టీన్యూస్ ఛానల్ తెలంగాణ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకొని సీమాంధ్ర ఛానళ్లు, పార్టీల కుట్రలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ ప్రజాధరణ పొందింది. నిరంతరం ఉద్యమ వార్తలు ప్రసారం చేస్తూ తెలంగాణ వాదాన్ని వీధి వీధికి, వాడ వాడకు చేరవేసింది. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సైతం తన శక్తినంత ధారపోసింది. అంతిమంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన టీన్యూస్ ఛానల్ ఉద్యోగుల కడుపు కొడుతూ వారి రక్తమాంసాలు పీల్చుకు తింటూ రాక్షసానందం పొందుతుంది. టీన్యూస్ లో జరుగుతున్న పరిణామాలు జర్నలిస్ట్ లోకాన్ని కలవరపాటుకు గురి చేసింది.

బీజేపీ మద్దతు..

టీన్యూస్ ఉద్యోగుల మెరుపు సమ్మెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ కు మద్దతుగా నడుస్తున్న ఛానల్లో ఉద్యోగులు సమ్మె బాట పట్టడం తెలంగాణలోని తాజా పరిస్థితికి నిదర్శనం అన్నారు. టీన్యూస్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.