అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనలో అనేక విశేషాలు ఉన్నాయి, పలు ప్రత్యేకతలు ఉన్నాయి, ఇక భారత్ లో కూడా ఆయన పర్యటన కోసం అనేక ఏర్పాట్లు చేశారు, తాజ్మహల్లోని సమాధుల నమూనాలను 300 సంవత్సరాల తర్వాత శుభ్రపరిచారు. ట్రంప్ రాక సందర్భంగా ఈ నమూనాలను శుభ్రపరచడం విశేషం.
భారత స్త్రీలు ముఖానికి వేసుకునే ఒకరకమైన మట్టిని సమాధుల నమూనాలకు వేసి అనంతరం డిస్టిల్డ్ వాటర్తో వాటిని శుభ్రం చేశారు. అయితే ఇది కేవలం ఇప్పుడు మాత్రమే చేశారు.. ఇలా చేసి గత 300 సంవత్సరాలు అయిందట, అయితే తాజ్ మహల్ కు లోపల ఇలా ఐదు సార్లు ట్రీట్ మెంట్ చేశారు అంటే శుభ్రపరిచారు, కాని సమాధుల నమూనాలు మాత్రం ఎక్కడా చేయలేదు, ఇప్పుడు మాత్రమే ట్రంప్ రాకకోసం వాటిని ఇలా శుభ్రం చేశారు.
ఇక్కడ క్లే ట్రీట్మెంట్ను నిర్వహించారు. .. తాజ్ మహల్లోని షాజహాన్, ముంతాజ్ల సమాధులు ఈ నమూనాల కిందే ఉన్నాయి. ప్రతి ఏటా మూడు రోజులు మాత్రమే ఈ సమాధులను వీక్షించటానికి అనుమతి ఉంటుంది.ఇక ట్రంప్ రాకతో మొత్తం ఫైర్ ఇంజన్లతో తాజ్ మహల్ ని అందంగా శుభ్రపరిచారు.