గోల్డ్ లోన్ కు వెళుతున్నారా కస్టమర్లు ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి

-

మనకు నగదు అవసరం అయితే వెంటనే ఇంట్లో ఉండే బంగారు ఆభరణాలు తాకట్టు పెడతాం, అయితే ఇప్పుడు బ్యాంకులు ఎన్బీఎఫ్సీలు లోన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే, అయితే ఎక్కడ వడ్డీ తక్కువో చూసి ఇప్పుడు అక్కడ మాత్రమే గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు.

- Advertisement -

గతంలో 75 శాతం మాత్రమే బంగారం విలువలో లోన్ ఇచ్చేవారు… కాని ఇప్పుడు ఆర్బీఐ నిర్ణయంతో లోన్ వాల్యూ బంగారం విలువలో 90 శాతం ఇస్తున్నారు, అంటే మీకు 90 శాతం బంగారం వాల్యూకి నగదు లోన్ గా ఇస్తారు..

SBI అతి తక్కువగా 7.50 శాతం, కెనెరా బ్యాంక్ 7.65 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల్లో 9.90 నుంచి 11.5 శాతం వడ్డీ ఉంటుంది. ఎన్బీఎఫ్సీలు 12 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. అంతేకాదు ప్రాసెసింగ్ ఫీజులు కూడా అదనంగా ఉంటాయి, అయితే ఈ చార్జీలు వడ్డీ ఎక్కడ తక్కువో చూసుకుని తీసుకోవడం మంచిది.

ఇక నెల నెలా వడ్డీ కట్టకపోతే వడ్డీ స్లాబ్ పెరుగుతుంది అది కూడా ముందే అడగాలి.
బ్యాంకుల్లో మూడు నెలలు ఆరునెలలు ఏడాదికి స్లాబ్ మారుతూ ఉంటుంది ఒక్కో బ్యాంకు రూల్ ఒక్కో విధంగా ఉంటుంది
లోన్ కావాలి అంటే కచ్చితంగా మీ ఐడీ ఫ్రూప్
పాన్ కార్డ్ తీసుకువెళ్లాలి
గోల్డ్ కాయిన్స్ని ఎన్బీఎఫ్సీలు తాకట్టు పెట్టుకోరు
మీరు బ్యాంకులో కొన్న కాయిన్స్ కి ఆ బ్యాంకులు మాత్రమే లోన్ ఇస్తాయి బయట ఎన్బీఎఫ్సీలు ఇవ్వరు
ఆర్బీఐ పాలసీ ప్రకారం ఒక కస్టమర్ గరిష్టంగా 50 గ్రాముల వరకు గోల్డ్ కాయిన్స్ని తాకట్టు పెట్టొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...