హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు జాగ్రత్తలు తీసుకోండి

-

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు, అయితే మన దగ్గర అంత నగదు లేకపోయినా బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటున్నారు లేదా ఫ్లాట్ తీసుకుంటున్నారు.. హోమ్ లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉందో తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచింది.

- Advertisement -

అంతేకాదు ఈ ఎంఐఈ ఆప్షన్, అలాగే చార్జీలు ఇలా అన్నీ కూడా ఆలోచించి తీసుకోవాలి, అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం, ఆ వ్యక్తి వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా అతని సంపాదన జీతం లాభం మీద హోమ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది.

అతని నెలవారీ ఆదాయంపై ఆధారపడి లోన్ అమౌంట్ ఇస్తారు, ఇక మార్కెట్లో ఆ ఆస్తి విలువ కూడా లెక్కించి లోన్ ఇవ్వడం జరుగుతుంది.. ఆస్తి విలువలో 80 శాతం నుంచి 90 శాతం మేరకే బ్యాంకులు హోమ్ లోన్ మంజూరు చేస్తాయి.
బ్యాంకుల్లో ముందు వడ్డీ రేటు ఎంతో తెలుసుకోవాలి, తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని అందించే బ్యాంకులను సంప్రదించండి.

ఇక ఫిక్స్ డు వడ్డీనా, లేదా మారుతూ ఉంటుందా అనేది కూడా అడిగి తెలుసుకోవాలి…రుణం ప్రాసెస్ చేయడానికి బ్యాంకులు ప్రాసెసింగ్ ఛార్జీలుగా తీసుకుంటాయి ఇది రుణంలో 0.25 శాతం నుండి 2 శాతం మధ్య ఉంటుంది అది ఎక్కడ తక్కువో చూసుకోవాలి.

హోమ్ లోన్కు దరఖాస్తుకు అన్నీ డాక్యుమెంట్లు సబ్ మీట్ చేస్తే ప్రాసెస్ పూర్తి చేసి 48 గంటల్లో రుణం కొన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి, లేకపోతే 5 రోజుల్లో నగదు ఇవ్వడం జరుగుతుంది, అంతా అకౌంట్లోనే జమచేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...