- Advertisement -
మీకు రేషన్ కార్డ్ ఉందా మీరు ప్రతీ నెలా రేషన్ తెచ్చుకుంటున్నారా.. క్రమం తప్పకుండా రేషన్ తెచ్చుకోండి, చాలా మంది రెండు నెలలకు మూడు నెలలకు ఓసారి ఇలా రేషన్ తెచ్చుకునే వారు ఉంటారు… ఇలాంటి వారికి ఓ వార్త, ఎవరైనా సరే వరుసగా మూడునెలలు రేషన్ తెచ్చుకోపోతే మీ రేషన్ కార్డ్ రద్దు అవుతుంది.. సో కచ్చితంగా ఈ విషయం గుర్తు ఉంచుకోండి.
మూడు నెలలు వరుసగా రేషన్ బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇక కొత్త రేషన్ కార్డులు చాలా మంది అప్లై చేసుకుంటున్నారు ..వాటిని పరిశీలించి అర్హులు అయితే ఇవ్వనున్నారు.సో ఎవరైనా సరే ఇలా రేషన్ మూడు నెలలుగా తెచ్చుకోపోతే ఇకపై ఇలాంటి పని చేయకండి.
కచ్చితంగా మీరు రేషన్ నెల నెలా తెచ్చుకోవాలి, కేవలం అర్హులకి మాత్రమే ఈ రేషన్ ఇస్తున్నారు, ఇక దేశంలో వన్ నేషన్ -వన్ రేషన్ విధానం కూడా అమలులోకి రానుంది అనే విషయం తెలిసిందే… దీని ద్వారా దేశంలో ఎవరు ఎక్కడ నుంచి అయినా రేషన్ తీసుకోవచ్చు.
|
|