సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని చిత్ర సీమ వారు ఎదురుచూస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, ఇక ఏడు నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి, తెలంగాణలో తాజాగా థియేటర్లు తెరుచుకోనున్నాయి.
డిశెంబరు 4 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి థియేటర్లు. అదే రోజున ఓ ఇంగ్లిష్ సినిమా విడుదల కానుండడంతో సినిమా హాళ్లను తిరిగి తెరవాలని వాటి యజమానులు నిర్ణయించారు. మల్టీప్లెక్స్లు కూడా ఆరోజే తెరుస్తారు, ఇక పూర్తిగా కాకుండా 50 శాతం సిటింగ్ కెపాసిటీతో సినిమాలు రన్ చేసుకోవచ్చు అని తెలిపింది సర్కారు. దీని కోసం సీట్ల మథ్య మార్కింగ్ శానిటైజేషన ప్రాసెస్ ఇలా అన్నీంటిని పూర్తి చేస్తున్నారు.
ఇక టికెట్ ధరలు పెంచుకోవచ్చు అని షోలు కూడా పెంచుకోవచ్చు అని తెలిపింది సర్కారు, అయితే ఒకే సమయానికి ఇంటర్వెల్ – షో పూర్తి అవ్వడం చేయకూడదు గ్యాప్ ఇవ్వాలి… వీటిపై టైమింగ్ టెక్నికల్ అంశాలు మార్పులు చేసుకుంటున్నాయి థియేటర్లు.
డిసెంబరు 4, లేదంటే 11 నుంచి సినిమా హాళ్లను తెరిచే అవకాశం ఉంటుంది, అయితే ఇక్కడ ఏ తెలుగు సినిమా ఇంకా విడుదల తేది ప్రకటించలేదు, మరి పాత సినిమాలు వేస్తారా కొత్తవి అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.