రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు రోడ్లపైనే ఉండి ఎవరిని బయటకు రానివ్వడం లేదు.. బయటకు వస్తే లాఠీలకి పనిచెబుతున్నారు… చాలా స్ట్రిక్ట్ గా అవి అమలు అవుతున్నాయి, ముఖ్యంగా బయటకు వచ్చి నిత్య అవసర వస్తువులు తీసుకోవడానికి కూడా కొద్ది సమయం మాత్రమే ఇచ్చారు. ఈ సమయంలోనే కాయగూరలు సరుకులు పాలు తీసుకోవాలి.
అయితే ఇప్పుడు హోమ్ డెలివరీ బిజినెస్ బాగా నడుస్తోంది, ఈ సమయంలో ఇంట్లో ఉండి కిరాణా వస్తువులు తెప్పించుకునే సదుపాయం కూడా ఉంది.. కాని ఆ డెలివరీ సంస్ధల ఉద్యోగులని పోలీసులు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు.
దీంతో ఆహార పదార్థాలు సరఫరా చేసే ఆన్ లైన్ సంస్థల వాహనాలు, నిత్యావసరాలు సరఫరా చేసే వాహనాల రాకపోకలకు అనుమతించాలని తెలంగాణ పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, మిల్క్ బాస్కెట్, స్పెన్సర్ వంటి నిత్యావసరాలు సరఫరా చేసే వారి వాహనాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అడ్డుకోవద్దని సూచించారు. ఆరు దాటిన తర్వాత వాటిని కూడా ఆపేయనున్నారు పోలీసులు.