మన దేశంలో ఈ వైరస్ ఇంతటి దారుణమైన పరిస్దితి కలిగించింది.. అయితే ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది అంటున్నారు మన దేశానికి …ఇది రైతులకి పంట పొలాలకి మరింత పెద్ద ముప్పు, తాజాగా మిడతల దండు ఉత్తరాది పొలాలపై పడి తినేస్తున్నాయి, అక్కడ పంటలను నాశనం చేస్తున్నాయి.
ఈ మిడతలు ఇప్పుడు తెలంగాణ వైపు వస్తున్నాయి. మహారాష్ట్ర నుండి మిడతల దండు తెలంగాణకు చేరుకునే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో మిడతల దండును నియంత్రిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని, ఒకవేళ అక్కడ అవి నియంత్రణ కాకపోతే ఇక మన తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు.
మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పూర్తిగా రైతులకి కూడా దీని గురించి తెలిపారు. మనపంటని కాపాడుకోవాలి లేకపోతే అవి దారుణంగా పంటలను తినేస్తాయి.