తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా – కేటీఆర్ ఏమ‌న్నారు?

తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా - కేటీఆర్ ఏమ‌న్నారు?

0
133
KTR

తెలంగాణ‌లో కేసులు సంఖ్య భారీగా పెర‌గ‌డంతో మ‌ళ్లీ జీహెచ్ ఎంసీ ప‌రిధిలో ముఖ్యంగా హైద‌రాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారు అని వార్త‌లు వినిపించాయి. అయితే లాక్ డౌన్ విధించే ఆలోచ‌న నుంచి మ‌ళ్లీ విర‌మించుకున్నారు, ఇక కేంద్రం అన్ లాక్ 3కి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చింది.. అయితే తాజాగా మ‌ళ్లీ లాక్ డౌన్ పై మంత్రి కేటీఆర్ మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు..

తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఏ మాత్రం లేవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో విఫలయ్యాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

గ‌తంలో పోలిస్తే తెలంగాణ‌లో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి, ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే అంశ‌మే, ఇక న‌గ‌రంలో చాలా వ‌ర‌కూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధ‌రించి అంద‌రూ కొనుగోలు చేస్తున్నారు, వ్యాక్సిన్ వ‌చ్చేవ‌ర‌కూ జాగ్ర‌త్త‌గా ఉండాలి అంటున్నారు నిపుణులు.