కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా తెలంగాణలో కూడా కొన్నింటికి పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్, లాక్ డౌన్ ఈ నెల 31 వరకూ కొనసాగుతుంది అని తెలిపారు..రాత్రి వేళ 7గం. నుంచి ఉదయం 6గం. వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ఇక నేటి నుంచి అన్నీ జిల్లాల్లో రెడ్ జోన్లు కంటైన్మెంట్లు మినహ ప్రతీ చోటా ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి, హైదరాబాద్ లో సిటీ బస్సులు, మెట్రో సర్వీసులు మాత్రం నడవవు.
1..అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ఉండవు
2. బస్సుల్లో శానిటైజేషన్ తప్పినసరిగా చేయాలి
3. హైదరాబాద్ లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి జిల్లా కేంద్రాలకు బస్సులు నడుస్తాయి
4.. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మాత్రం మూసివేసే ఉంటుంది
5. హైదరాబాద్ నగరంలో ఆటోలు,ట్యాక్సీలకు అనుమతి
6.. ఆటోల్లో 1+2,ట్యాక్సీల్లో 1+3 లెక్కన ప్రయాణికులకు అనుమతి
7.రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల అన్ని షాపులు తెరుచుకుంటాయి.
8. హైదరాబాద్ లో సరిబేసి విధానంలో షాపులు తెరచుకుంటాయి.
9. కంటైన్మెంట్ జోన్లో అనుమతి లేదు, షాపులు క్లోజ్
10..ఈకామర్స్ సంస్థలకు 100శాతం అనుమతి ఇచ్చారు.