తెలంగాణలో వైరస్ కేసులు పెరుగుతున్నాయి కాని కేవలం హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి, అయితే కొన్ని జిల్లాలు మాత్రం కేసుల విషయంలో సేఫ్ జోన్ లో ఉన్నాయి అని చెప్పవచ్చు.. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల వల్ల పోలీసులు డాక్టర్ల సేవల వల్ల చాలా వరకూ గ్రామాలకు ఇది పాకలేదు.
తెలంగాణలో ఇప్పటివరకూ ఐదు జిల్లాలను అసలు తాకనేలేదు. మరో ఆరు జిల్లాల్లో వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. ఇక నిబంధనల సడలింపు విషయంలోకేంద్రం ఆయా రాష్ట్రాలకు కాస్త అవకాశం ఇచ్చింది.
గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ వంటి చోట్ల జాగ్రత్తలు తీసుకుని వారి పనులు వారు చేసుకునేలా అవకాశం కల్పించవచ్చు అని చెబుతున్నారు… దీంతో తెలంగాణలో 11 జిల్లాల్లో ప్రజలకు కాస్త రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది అంటున్నారు, తెలంగాణలో నారాయణ పేట, వనపర్తి, వరంగల్ రూరల్, మంచిర్యాల , యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు ఇక్కడ సడలింపులు ఇవ్వచ్చు అంటున్నారు.