తెలంగాణలోకి మిడతలు వచ్చేశాయి..ఈ ప్రాంతాల రైతులు జాగ్రత్త

తెలంగాణలోకి మిడతలు వచ్చేశాయి..ఈ ప్రాంతాల రైతులు జాగ్రత్త

0
104

తెలంగాణలోకి మిడతలు రావు అని అందరూ భావించారు… అవి దిశను మార్చుకున్నాయి అని అందరూ సంతోషంలో ఉన్నారు, అయితే ఈ సమయంలో మళ్లీ మిడతల వార్త అందరిని కలవరపాటుకి గురిచేస్తోంది..మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి గత నెలలోనే ప్రవేశించిన మిడతల దండు. తాజాగా తెలంగాణలోకి ప్రవేశించిందని చెప్పారు అధికారులు.

మహారాష్ట్ర నుంచి జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేట ప్రాంతంలోకి మిడతలు ప్రవేశించాయి.పెద్దంపేట గోదావరి పరివాహక ప్రాంతంలో చెట్ల ఆకులను నమిలి పారేస్తున్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తమ పంట పొలాలను సర్వనాశనం చేస్తాయని భయపడుతున్నారు. ఇక ఆ మిడతలు అక్కడ నుంచి ఎటువైపు వెళతాయి అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పుడు పంట చిగురు దశలో ఉంటుంది వీటిని నాశనం చేస్తే రైతుకి చాలా నష్టం అని డైలమాలో ఉన్నారు, ఇటు ప్రభుత్వం కూడా వీటిని తరిమేందుకు చర్యలు తీసుకోనుంది.. కామారెడ్డి , భద్రాద్రి కొత్తగూడెం , సంగారెడ్డి, ములుగు , మంచిర్యాల , ఆదిలాబాద్ , నిర్మల్ , ఆసిఫాబాద్ , నిజామాబాద్ జిల్లాలలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు అధికారులు.