తెలంగాణ‌లో ప్ర‌తీ ఇంటికి ఇవి ప‌క్కాగా అందుతాయి

తెలంగాణ‌లో ప్ర‌తీ ఇంటికి ఇవి ప‌క్కాగా అందుతాయి

0
95

దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు మ‌రిన్ని పెరుగుతున్నాయి, ఈ స‌మ‌యంలో లాక్ డౌన్ అమ‌లు జ‌రుగుతోంది, కేంద్రం మే 3 వ‌ర‌కూ లాక్ డౌన్ విధించింది, ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం అన్నీ రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి, అయితే తెలంగాణ‌లో లాక్ డౌన్ మే 7 వ‌ర‌కూ అమ‌లు అవుతుంది అని ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. 3 కోట్లపైగా మాస్కులను తయారు చేయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్ప‌టికే ఏపీలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అక్క‌డ కూడా ఇంటికి నేరుగా వెళ్లి మాస్క్ లు అందిస్తున్నారు.

మాస్కుల తయారీ, కొనుగోలు, పంపిణీ బాధ్యతలను స్థానిక సంస్థలైన పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్‌, మెప్మాలకు అప్పగించారు. ఒక్కో మాస్కుకు రూ.15 చెల్లించి పంచాయితీలు, మున్సిపాలిటీలు వీటిని కొనుగోలు చేయనున్నాయి. ఇక మాస్కులు ఎలా అంటే, స్దానికంగా ఉన్న మ‌హిళా సంఘాల సాయంతో వీటిని త‌యారు చేయించాలి అని చెప్పారు.