తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ – ఏపీ ప్రజలు ప్రయాణాలు

తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ - ఏపీ ప్రజలు ప్రయాణాలు

0
89

కేంద్రం మరో నెల లాక్ డౌన్ ప్రకటించింది, ఈ సమయంలో కేంద్రం పలు మార్గదర్శకాలు ఇచ్చింది, అంతరాష్ట్ర ప్రయాణాలు చేయచ్చని తెలిపింది, దీనికి ఆయరాష్ట్రాలు ఒప్పుకోవాలి అని తెలిపింది, దీనిలో భాగంగా తెలంగాణ సర్కార్ అంత రాష్ట్ర చెక్ పోస్టులు ముఖ్యంగా ఏపీ నుంచి తెలంగాణకు ఎవరైనా రావాలి అని భావిస్తే వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మొత్తం సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఎత్తివేసింది, దీంతో ఏపీ నుంచి రోజూ వేలాది మంది తెలంగాణ వస్తున్నారు, ముఖ్యంగా ఇక్కడ కంపెనీలు ఫ్యాక్టరీలు ఆఫీసులు తెరచుకున్నాయి, ఈ సమయంలో ఏపీలో ఉండిపోయిన వారు అందరూ తిరిగి వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడానికి బయలుదేరుతున్న తెలంగాణ వాసులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఏపీకి వెళ్లాలి అంటే కచ్చితంగా స్పందనలో రిజిస్టర్ అయి ఈ పాస్ తీసుకోవాల్సిందే..తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వాడపల్లి, నాగార్జున సాగర్, కోదాడ సమీపంలోని చెక్ పోస్టులను ఎత్తివేసింది.